దైవారాధన
దైవస్తుతి
సృష్టికర్త ప్రస్తుతి
రా-కాంభోజి తా- ఆట
అన్ని కాలంబుల – నున్న యెహోవాని – నెన్నందరంబయో – కన్న
తండ్రి – వన్నె కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతు – లున్నతమై యుండ –
మున్నె నీకు ॥నన్ని।
నిన్నుం బ్రకటన సేయ – నిఖిల లోకములను- బన్నుగం జేసిన – బలుండ
వీవె = ఉన్న లోకంబుల – నుడుగక కరుణా సం-పన్నతతో నేలు –
ప్రభుండ వీవె = అన్ని జీవుల నెజింగి – యాహార మిచ్చుచు – నున్న సర్వజ్ఞుండవు నీవే = ఎన్న శక్యముగాక – ఉన్న లక్షణముల – సన్నుతించుటకు
నేం – జాలుదునా ॥యన్ని॥
పుట్టింప నీవంచుం – బోషింప నీవంచుం-గిట్టింప నీవంచు – గీర్తింతును
= నట్టి పనికి మాలి – నట్టి మానవుల చే – పట్టి రక్షింపం బా-ధ్యుండ వంచు
= దట్టమైన కృపను దరింజేర్చ నాకిచ్చి లా పట్టయి నిలచియుండు – ప్రభుండ
వంచుం = గట్టడచేం గడ – ముట్టుదనుక నా – పట్టుకొలంది నిన్నుం – బ్రస్తు
తింతు ॥నన్ని॥
కారుణ్యనిధి వీవు – కఠినాత్ముందను నేను – భూరి శుద్ధుండ వీవు – పాపి
నేను = సార భాగ్యుడ వీవు – జగతిలో నాకన్న – దారిద్రుందే లేండు –
తరచి చూడ = సార సద్దుణముల – సంపన్నుండవు నీవు – ఘోర దుర్గుణ
సం- చారి, నేను = ఏ రీతి స్తుతియింతు – నే రీతి సేవింతు – నేర మెన్నక
ప్రోవ – నెర నమ్మితి ॥నన్ని॥
– బేళాళ జాన్
Leave a Reply