దేవుడు సర్వస్తోత్ర పాత్రుడు
రా – ఆనందభైరవి (ఛాయ : యెహోవ భజన) తా – త్రిపుట
గానముం జేయుండు సుకీర్తనను = యెహో – వాను గూరిచి క్రొత్తం –
గాను రక్తిగను ॥గానము॥
1. తన్నామము నుతించి యతని – రక్షం – జెన్నుంగ సారెం బ్ర – సిద్ధముం
జేసి = పన్నుగ నన్యులలో దన్మహిమ – యం – దున్నత చిత్రము – లను
జాటండి 1॥గానము॥
2. ఘనతయు మహత్యమును – ద – ధ్ధనని యెదుటనుండు – ఘనబలమును=
వినతమౌ సౌందర్యమును – న – తనివి నిర్మల స్థల -మున విలసిల్లు ॥గానము॥
3. పరిశుద్దాలంకారముతో – నా – పరమాత్మారాధన – పరులై యుండండి =
ధరణి సకల జనులారా – లోక – గురుని యెదుట భీతిం – గొనుచు నుండండి॥గానము॥
4. పరిపాలించుచున్నాం డనుచు తోడి – నరులతోం జెప్పుండి – ద్ధరం గదకుండ
= స్థిరముగం జేయు సత్యముగా – జనుల – కరిమురిగాను న్యా – యము
విమర్శించు ॥గానము॥
5. ఏమనిన నా మహాత్ముండు – వచ్చు – నీ మహికి న్యాయము – నేర్పరచు
టకు = భూమి జనులకు నీతి సత్య – ముల – తో మించున్యాయమెం -తో
విమర్శించు ॥గానము॥
6. జనులారా యా యెహోవాకు – మహి – మను బలమును సమర్పణము
జేయండి వినయముతోం గానుకలను – తీసి – కొని తత్రాకారమందున వసియింపండి 1॥గానము॥
– విలియం డాసన్
Leave a Reply